వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై 'ప్రజా ఉద్యమం
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండలోని వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ 'ప్రజా ఉద్యమం' పోస్టర్ను ఆవిష్కరించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రజల న్యాయం కోసం వైసీపీ ఎప్పుడూ పోరాడుతుందని తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆమె మాట్లాడుతూ రేపు వై జంక్షన్ నుంచి మెడికల్ కాలేజీ వరకు భారీ బైక్ ర్యాలీ జరుగుతుందని, నాయకులు పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.