శ్రీశైల మహాక్షేత్రంలో ధర్మపథం వేదికపై శనివారం ఒంగోలుకు చెందిన లలిత గాయత్రీ సంగీత కళానిలయం వీణానాదన అద్భుతంగా ఆకట్టుకుంది. వీణపై తీగలను మీటుతో మహత్తరమైన శివుడు, అమ్మవారు గీతాలను శ్రావ్యంగా వినిపించారు. గురువు నాగలక్ష్మి ఆధ్వర్యంలో కె. నాగలక్ష్మి, మానసి, గీతా ప్రవల్లిక, చాందిని దేవసేన తమ వీణా నాదంతో ఆకట్టుకోగా, వీరిని శ్రీశైల ఆలయ అధికారులు ఘనంగా సన్మానించారు.