శ్రీకాకుళం: మద్యానికి బానిసై భార్యాభర్తల మధ్య గొడవలతో గడ్డి మందు త్రాగి ఆత్మహత్య చేసుకున్న కురిగాం గ్రామానికి చెందిన బాలకృష్ణ
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కురిగాం గ్రామానికి చెందిన బాలకృష్ణ మద్యానికి బానిస అయ్యారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో మనస్థాపానికి గురై గడ్డి మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కొత్తూరు పోలీస్ స్టేషన్ హెచ్ సి కోటేశ్వరరావు మంగళవారం సాయంత్రం తెలిపారు.. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు..