తాడిపత్రి పట్టణంలోని పెన్నా నది ఒడ్డున వెలిసి ఉన్న అతి పురాతనమైన, పవిత్రమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీకమాసం మూడవ సోమవారాన్ని పురస్కరించుకొని భక్తులు పోడెత్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చనలు, అభిషేకాలు వంటి పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగం చేశారు. ఆలయంతో పాటు పరిసరాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.