రంప చోడవరం లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 70 అర్జీలు
రంపచోడవరం ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 70 అర్జీలు వచ్చినట్లు ఐటీడీఏ పీఓ స్మరన్ రాజ్ తెలిపారు. మారేడుమిల్లి మండలం వేటుకురు పంచాయతీలో రబ్బర్ ప్రోసెస్సింగ్ యూనిట్ మంజూరు చేయాలని, కోట- వలస గ్రామాల మధ్య కాలువపై వంతెన నిర్మించాలని తదితర వినతులు వచ్చినట్లు ఆయన తెలిపారు. కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించామని, మరికొన్నింటిని సంబంధిత అధికారులకు నివేధించామన్నారు