కుప్పం: ఊరినాయనపల్లిలో నీటి కోసం వేదన
కుప్పం మండలం గుడ్లనాయనపల్లి పంచాయతీ ఊరినాయనపల్లి ఎస్సీ కాలనీలో నీళ్ల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సీ కాలనీలో మంచినీటి సమస్య తలెత్తినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆదివారం. ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్ల కోసం వ్యవసాయ బావులు, చెరువు వద్దకు పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ మహిళలు విజ్ఞప్తి చేశారు.