బందరులో స్వస్ధ నారీ సశక్తి పరివార్' కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర
Machilipatnam South, Krishna | Sep 17, 2025
మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్తానిక మచిలీపట్నంలోని పాండురంగ్ హైస్కూల్లో నిర్వహించిన 'స్వస్ధ నారీ సశక్తి పరివార్' కార్యక్రమాన్ని బుధవారం మద్యాహ్నం 3 గంటల సమయంలో మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. విద్య, వైద్య రంగాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాయని తెలిపారు.