జగన్తో మాజీ మంత్రి అనిల్ భేటీ తాడేపల్లిలో YCP అధినేత జగన్ను ఆయన నివాసంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా వారు జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. నాయకులు, నేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇరువురు చర్చించుకున్నట్లు సమాచారం. ప్రజా సమస్యలపై మరింతగా ముందుకు వెళ్లాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది.