ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లాడ్జిలను తనిఖీ చేస్తున్న పోలీసు యంత్రాంగం, కొత్త వ్యక్తుల కదలికలపై నిఘ
Ongole Urban, Prakasam | Nov 11, 2025
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో పలు లాడ్జిలను పోలీసు యంత్రాంగం సోమ మంగళవారాలు ముమ్మర తనిఖీలు చేపట్టారు. రిజిస్టర్లను పరిశీలించి కొత్త వ్యక్తులకు గదులు అద్దెకిచ్చేటప్పుడు పూర్తి వివరాలు సేకరించాలని పోలీసులు యాజమాన్యాలకు తెలిపారు. అనుమానిత వ్యక్తులకు గదులను అద్దెకు ఇవ్వవద్దని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.