రాయదుర్గం: పట్టణంలోని జామియా మహమ్మదీయ అరబియా మదరసా లో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం, హాజరైన ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
రాయదుర్గం పట్టణంలోని జామియా మహమ్మదీయ అరబియా మదరసా లో జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు, ఎంఈవో ఇర్షాద్, వెంకట రమేష్ హాజరై మాట్లాడారు. భారతదేశ మెదటి విద్యా, మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేసిన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేశారు.