అనంతపురం: అనంతపురం నగరంలోని ప్రభుత్వ ఐటిఐ మహిళ కళాశాల సమీపంలో రైలు కిందపడి గుర్తు తెలియని యువకుడు మృతి
అనంతపురం నగరంలోని ప్రభుత్వ మహిళా ఐటిఐ కళాశాల సమీపంలో రైలు కిందపడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. 20 నుంచి 25 ఏళ్ల లోపు ఉన్న యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలాన్ని రైల్వే ఎస్సై వెంకటేష్ పరిశీలించారు.