ముక్కంటి ఆలయ పాలకమండలి సభ్యురాలుగా కోలా విశాలాక్షి ప్రమాణ స్వీకారం
ఆలయ పాలకమండలి సభ్యురాలుగా కోలా విశాలాక్షి ప్రమాణ స్వీకారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలిగా కోలా విశాలాక్షి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం శ్రీ మేధా గురు దక్షిణామూర్తి స్వామి వారి సన్నిధానంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి. బాపిరెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ పాల్గొన్నారు.