భూపాలపల్లి: జిల్లా కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి : ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజకుమార్
జిల్లా కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గాను ఆ హాస్టల్ ఎదుట బుధవారం మధ్యాహ్నం 2:40 గంటల సమయంలో ఆందోళన చేపట్టారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు గత నాలుగు రోజుల నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ వారి సమస్యలపై సంబంధిత వార్డెన్ పటించుకోవడంలేదని మండిపడ్డారు.