దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ముందస్తుగా విక్రయాలు, కొనుగోళ్లతో మంచిర్యాల పట్టణంలో సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారస్థులు విచ్చేసి విక్రయాలు జరుపుతున్నారు. బంతి పూల విక్రయదారులు మాట్లాడారు. పండుగకు విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తువులు తీసుకువచ్చి ఇక్కడ జరుపుతున్న విక్రయాలు లాభసాటిగా ఉంటున్నాయని సంతోషం వ్యక్తం చేశారు..