ప్రొద్దుటూరు: ఎగ్జిబిషన్ బకాయిల ఎగవేత పై మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రభస
Proddatur, YSR | Oct 27, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ బకాయిల ఎగవేతపై సోమవారం ఉదయం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర రభస జరిగింది.తెలుగుదేశం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కౌన్సిలర్లు ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్లు ప్రజల నుంచి అధిక ధరలు వసూలు చేస్తూ.. మున్సిపాలిటీకి లీజు డబ్బులు చెల్లించడం లేదని మున్సిపల్ వైస్ ఛైర్మన్లు బంగారెడ్డి, ఖాజా అధికారులను నిలదీశారు. ఎగ్జిబిషన్ టెండర్దారుల నుంచి చెక్కులు తీసుకున్నామని మేనేజర్ తెలిపారు. ఎగ్జిబిషన్ టెండర్ కోర్టు పరిధిలో ఉందని కమిషనర్ రవిచంద్ర రెడ్డి తెలిపారు.