తిరుపతి చిత్తూరు జిల్లాల పర్యటన నిమిత్తం వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్న కాళ్లతోర్ ముప్పు బాధితులను పరామర్శించకపోవడం సరైన పద్ధతి కాదని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం జిల్లా కమిటీ తప్పు పట్టింది ఎర్రచందనం చెట్లకు వచ్చిన ప్రాధాన్యత దళితవాడలో సర్వస్వం కోల్పోయే అవస్థలు పడుతున్న ప్రజలకు ఇవ్వకపోవడం సరైనది కాదని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తెలిపారు సినిమాలలో కష్టాలు చూపించే వీరికి నిజంగా కష్టాలు పడుతున్న వారి బాధలు పట్టవాని ఎద్దేవా చేశారు