పట్టణంలోని 5వ వార్డులో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్పర్సన్, స్వచ్ఛభారత్ కార్పొరేషన్ డైరెక్టర్
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ఐదవ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ దిల్షాద్ ఉన్నిసా, స్వచ్ఛభారత్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీన్ భాను కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్కులో, పార్కు ఆవరణలో మొక్కలు నాటారు. మొక్కలను సంరక్షించుకోవాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు.