కొత్తూర్: సూర్యాపేట డంపింగ్ యార్డ్, ఎరువుల తయారీ, మురుగునీటిని శుద్ధి చేయడం వంటి పనులను పరిశీలించిన షాద్నగర్ మున్సిపల్ అధికారులు
షాద్నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ ఛైర్మన్ నరేందర్ అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లతో కలిసి సందర్శించారు. అనంతరం మున్సిపాలిటీలోని డంపింగ్ యార్డ్, తడి చెత్త, ఎరువుల తయారీ, మురుగునీటిని శుద్ధి చేయడం వంటి పనులను పరిశీలించారు. సూర్యాపేట తరహాలోనే షాద్నగర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు అందరూ సహకరించాలన్నారు.