పెడన: పెడన పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఐజీ వి. జి. అశోక్ కుమార్
Pedana, Krishna | Nov 23, 2024 పెడన లో వార్షిక తనిఖీల్లో భాగంగా ఏలూరు రేంజ్ ఐజి జి. వి. జి. అశోక్ కుమార్ శనివారం పెడన పోలీస్ స్టేషన్ నందు వార్షిక తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఇతర పోలీసు అధికారులతో కలిసి మొక్కను అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఐ.జి పలు రికార్డులను పరిశీలించి, ఆయా స్టేషన్ల పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులపై ఆరా తీసి, అనంతరం కేసులకు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.