పత్తికొండ: పత్తికొండలో బోయ వాల్మీకి సమితి సమావేశం
పత్తికొండలో సోమవారం బోయ వాల్మీకి సమితి జిల్లా అధ్యక్షుడు రాముడు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే విరుపాక్షిని కించపరిచి మాట్లాడటాన్ని బోయ వాల్మీకి సంఘం ద్వారా ఖండిస్తున్నామన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జ్యోతి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని మీరు మీ పార్టీలో ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించడంలో మీ వైఖరి ఏంటో తెలపాలన్నారు.