సూళ్లూరుపేట పోలీసులు అమ్మవారికి సారె సమర్పణ
– ఘనంగా కొనసాగుతున్న చెంగాళమ్మ దసరా ఉత్సవాలు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం సూళ్లూరుపేట పోలీస్ శాఖ వారు భక్తి శ్రద్ధలతో సారెను సమర్పించారు. సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ నుండి అధికారులు, కుటుంబ సభ్యులు ఊరేగింపుగా సారెను ఆలయానికి తీసుకెళ్లి ఆలయంలో సహాయ కమిషనర్ ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో వేదపండితులతో పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి సారె సమర్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐ మురళీకృష్ణ, ఎస్సై బ్రహ్మనాయుడు, తడ ఎస్సై కొండప్ప నాయుడు, దొరవారిసత్రం ఎస్సై అజయ్‌కుమార్, పోలీసులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.