తాడిపత్రిలోని అతి పురాతనమైన సి చింతల వెంకటరమణ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు మురళీకృష్ణ అయ్యంగార్ కు ఆదివారం వేద విజ్ఞాన నిధి బిరుదును ప్రదానం చేశారు. అనంతపురంలో అనంత బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మురళీకృష్ణ అయ్యంగార్ కు వేద విజ్ఞాన నిధి బిరుదును ఇవ్వడంతోపాటు శాలువాలతో ఘనంగా సత్కరించారు.