కుందుర్పికి చెందిన వార్త రిపోర్టర్ తిమ్మప్పపై జీడిపల్లికి చెందిన గంగాధర్, ఆదినారాయణ దాడి చేశారు.ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. తిమ్మప్ప కళ్యాణ దుర్గం లోని సీఐ ఆఫీసు సమీపంలో నిలబడి ఉండగా గంగాధర్,ఆదినారాయణ లు గొడవ పెట్టుకున్నారు.తిమ్మప్ప సెల్ ఫోన్ ను కింద పడి వేయడంతో పాటు షర్టు పట్టుకొని దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనపై తనపై అకారణంగా గంగాధర్,ఆదినారాయణ దాడి చేసినట్లు తిమ్మప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.