పూతలపట్టు: అయ్యప్ప స్వామి భక్తులు రానున్న నేపథ్యంలో స్వచ్ఛ కాణిపాకం కార్యక్రమం
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో ఆలయ ఈఓ పెంచల కిషోర్ సూచనల మేరకు, పద్మావతి ఏజెన్సీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాణిపాకం కార్యక్రమం నిర్వహించారు.మేనేజర్ నాగార్జున నాయకత్వంలో డార్మెటరీ, బస్టాండ్ ప్రాంతాల్లో మరియు ఆలయ పరిసరాల్లో విస్తృత స్థాయిలో శుభ్రతా కార్యక్రమాలు చేపట్టారు. దేవాలయాన్ని పరిశుభ్రత మరియు అభివృద్ధి పరంగా రాష్ట్రంలో నెంబర్ 1గా నిలపడం లక్ష్యమని ఈఓ తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన సిబ్బంది, అభివృద్ధి కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.