యర్రగొండపాలెం: శానిటేషన్ వర్కర్లకు పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల ఆవరణము నందు సిఐటియు ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్ల పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు రఫీ మాట్లాడుతూ గత ఏడు నెలలుగా శానిటేషన్ వర్కర్లకు జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిత్యవసర వస్తువులు పెరిగిపోవడంతో జీతాలు రాక పూట గడవడమే కష్టంగా మారిందని వారు వాపోయినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న శానిటేషన్ వర్కర్ల జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరారు.