మార్కాపురం: దీపావళి పండుగ సందర్భంగా పట్టణంలోని పలు వీధులలో నరకాసురుడి వధ కార్యక్రమం
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రాజాజీ బజార్, నాయుడు బజార్లో ఏర్పాటు చేసిన నరకాసురుడి వధ కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. దీపావళి పండుగ సందర్భంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు. స్వామి వారి చేతుల మీదుగా నరకాసుడి వధ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా హిందూ సంఘాలు భారీ నరకాసురుడిని ఏర్పాటు చేశారు. స్థానికులు ఈ కార్యక్రమాన్ని తిలకించి చెన్నకేశవ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.