పెద్ద గుమ్మడ పురం గ్రామంలో అంగరంగ వైభవంగా: శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని పెద్ద గుమ్మడాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన కాశీ విశ్వేశ్వర స్వామి ప్రతిష్ట మహోత్సవములు గురువారం ఉదయం 9 గంటలకు ప్రాత:కాల పూజ ఆవాహిత దేవత పూజ, యంత్రాభిషేకం, మూలమంత్ర జపాదులు, హోమాధులు గణపతి, నవగ్రహ, రుద్ర హోమం, దీక్ష హోమం, గ్రామోత్సవం, మహా మంగళహారతి, తీర్థ ప్రసాదం ఆశీర్వచనం జరుగును. సాయంత్రం 5:30 గంటలకు ప్రదోష పూజ, జపహోమాలు, దాన్యాది వాసం, శయాది వాసం, పుష్పాదివాసం, ఆదివాస హోమాలు, స్వస్తి మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదం పూజలు జరుగును.