కంచిసముద్రం వంకలో ప్రవహిస్తున్న వర్షపు నీరు
శ్రీ సత్య సాయి జిల్లా రొద్దం మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొన్ని చోట్ల వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం కంచిసముద్రం గ్రామ సమీపంలోని వంకలోకి వర్షపు నీరు చేరింది. దీంతో సమీప బోరు బావుల్లో నీరు బాగా వస్తాయని స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా వంకలు, చెరువుల వద్దకు చిన్నపిల్లలు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు.