రాయదుర్గం: స్టాక్ ఉన్నప్పటికీ యూరియా పంపిణీ చేయని అధికారులు, నాగలాపురం మల్లికేతి సొసైటీ అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం
డి.హిరేహాల్ మండలంలోని నాగలాపురం పంచాయతీ మల్లికేతి సహకార సొసైటీలలో స్టాక్ ఉన్నప్పటికీ తమకు యూరియా ఇవ్వలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మద్యాహ్నం పలువురు రైతులు మాట్లాడుతూ ఉదయం నుంచి యూరియా కోసం క్యూలో ఉన్నామన్నారు. కౌంతమందికి పంపిణీ చేసి చివరలో అయిపోయిందంటూ అధికారులు చేతులెత్తేశారని తెలిపారు. 30 సంచుల యూరియా ఉన్నప్పటికీ ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. ఉన్నతాధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదని అన్నారు.