సురుటుపల్లి పల్లి కొండేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చకుల నియామకానికి ఆమోదం
సురుటుపల్లిలో అర్చకుల నియామకానికి ఆమోదం నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లి కొండేశ్వర దేవస్థానంలో బుధవారం తొలి పాలకమండలి సమావేశం ఛైర్మన్ పద్మనాభ రాజు అధ్యక్షతన జరిగింది. ఆలయంలో ఇద్దరు తెలుగు అర్చకులు, ఓ అటెండర్ను నియమించాలని తీర్మానించారు. 2026లో జరగనున్న శివరాత్రి ఏర్పాట్లపై చర్చించారు. అక్టోబర్ నెల ఆదాయ వ్యయాలను పరిశీలించి ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ఛైర్మన్ తెలిపారు. ఈవో లత పాల్గొన్నారు.