సంగారెడ్డి: ముని దేవునిపల్లి లో ప్రభుత్వం భూసేకరణ ఆపాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం ముని దేవునిపల్లి ప్రభుత్వం సర్వేనెంబర్ 92లో భూ సేకరణను ఆపాలని సంగారెడ్డి జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని తెలిపారు. లేని పక్షాన పెద్ద ఎత్తున సంగారెడ్డి కలెక్టరేట్ ను ముట్టడిస్తామని తెలిపారు.