కార్తీక పౌర్ణమి నాడు అంధకారంలో అర్ధనారీశ్వర స్వామి వారి ఆలయం, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మండిపాటు
శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీఅర్ధనారీశ్వర స్వామి ఆలయంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడటంపై మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రోడ్లను వేసే దుస్థితిలో కూడా ఈ ప్రభుత్వం, ఈవో లేరని మండిపడ్డారు. 'ఇసుక దోచుకోవడం కాదు, కనీసం ఈ రోడ్డుపై ఇసుక వేయలేరా' అని ఆయన ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.