రేణిగుంట: కాచిన నీటిని తాగండి రేణిగుంట మండల ఎలమండ్యం గ్రామంలో హెల్త్ సూపర్వైజర్ కామరాజు, ఏఎన్ఎం నళిని, ఆశా వర్కర్ ఉష కలిసి దోమల లార్వా వృద్ధిని ప్రత్యక్షంగా చూపిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షాల కారణంగా నీటిని మరగజేసి తాగాలని, చల్లని పదార్థాలు తగ్గించాలని సూచించారు. గృహాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని, ప్రతి శుక్రవారం డ్రైడే పాటిస్తే మలేరియా, డెంగీ వంటి వ్యాధులు నివారించవచ్చని తెలిపారు.