మంత్రాలయం: బసలదొడ్డి గ్రామంలో మంగళవారం వెటర్నరీ అసిస్టెంట్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పశువులకు గాలి వ్యాధి నివారణ టీకాలు
పెద్ద కడబూరు: మండలంలోని బసల దొడ్డి గ్రామంలో మంగళవారం వెటర్నరీ అసిస్టెంట్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పశువులకు గాలి వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఆవులు, గేదెలు, దూడలు, ఎద్దులకు టీకాలు వేసినట్టు ఆయన తెలిపారు. మూగజీవులు అనారోగ్యం బారిన పడకుండా టీకాలు మేలుకలిగిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గవిగట్టు ఈరన్న, ఏహెచ్ఐలు రోజాబాయ్, శరత్ పాల్గొన్నారు.