అన్నమయ్య జిల్లా లో దిత్వా తుఫాను ప్రభావం.. ప్రజా ఫిర్యాదుల వేదిక రద్దు: జిల్లా ఎస్పీ ధీరజ్
జిల్లాలో దిత్వా తుఫాను హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో, రేపు (డిసెంబర్ 1) నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సమావేశాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ ఒక ప్రకటనలో తెలిపారు.తుఫాను ప్రభావంతో వర్షాలు, గాలులు తీవ్రం కావచ్చని, ఇటువంటి పరిస్థితుల్లో సుదూర ప్రాంతాల నుండి అర్జీదారులు ప్రయాణించి ఇబ్బందులు పడకుండా రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలంటూ సూచించారు.