భువనగిరి: మోట కొండూరులోని యూరియా కోసం బారులు తీరిన రైతులు
యాదాద్రి భువనగిరి జిల్లా మోట కొండూరులో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం పిఎసిఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఎండలో నిలబడలేక తమ చెప్పులను క్యూలో ఉంచే నిరీక్షణ చేస్తున్నామని అధికారులు వెంటనే స్పందించి యురియాను సకాలంలో అందించాలని తెలిపారు. సూర్య అందించకపోవడంతో పండించిన పంటలు ఎండిపోయే పరిస్థితితో పాటు పంట చేతికి అందకుండా పోతుందనే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.