జమ్మలమడుగు: కాశీనాయన : మండలంలోని ఉప్పొంగిన ఉప్పులూరు వాగు...ఏడు గ్రామాల ప్రజలకు నిలిచిపోయిన రాకపోకలు
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని కాశినాయన మండలంలోని ఉప్పలూరు గ్రామం వెళ్లే ప్రధాన బస్సు రహదారిలో ఉప్పులూరు వాగు ఉప్పొంగి పారుతున్నట్లు బుధవారం స్థానికులు తెలిపారు.ఉప్పులూరు వాగు ఉధృతంగా పారుతుండడంతో ఏడు గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి.అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు తహసీల్దార్ వెంకటసుబ్బయ్య వాగును పరిశీలించారు. ఉప్పలూరు గ్రామంలో పలు పాత మిద్దెలు శిథిలావస్థలో ఉంటూ కారుతున్నాయని ప్రజలు తెలిపారు.వాగు పై బ్రిడ్జి నిర్మించాలని పలుమార్లు విన్నవించుకున్న పరిష్కారం శూన్యమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.