రాయదుర్గం: ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి : గుమ్మగట్టలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టువిశ్వనాథ్ రెడ్డి
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకూ ఉద్యమం ఆగదని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టువిశ్వనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఉదయం నుంచి మద్యాహ్నం వరకూ గుమ్మగట్ట మండల కేంద్రంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం విద్య, వైద్యం పేదలకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. అన్నీ ప్రైవేటీకరణ చేస్తూపోతే ఇక ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని, కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లక్మీకాంత రెడ్డి, వ