పరిమితికి మించి నగదు రవాణాలో పత్రాలు తప్పనిసరిగా ఉండాలి: ఏలూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ముక్కంటి
Eluru, Eluru | Apr 1, 2024 ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నగదు కన్నా అధిక మొత్తంలో నగదు రవాణా చేస్తే సదరు నగదుకు సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలని, లేని పక్షంలో నగదును సీజ్ చేస్తామని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఎం.ముక్కంటి అన్నారు. కైకలూరు రోడ్డులోని మాదేపల్లి వద్ద ఆదివారం సాయంత్రం ఎంసీసీ, స్టాటిస్టికల్ సర్వేలెన్స్ బృందాలతో కలిసి వాహనాలను ఆయన విస్తృతంగా తనిఖీ చేశారు.