ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం ఒంగోలులో పర్యటించారు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తో పాటు మంత్రి బాల వీరాంజనేయ స్వామిని నరసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాకు నూతన టిడిపి అధ్యక్షుడిగా ఎన్నికైన నరసింహారెడ్డిని సన్మానించి వారు శుభాకాంక్షలు తెలిపారు. 2029లో ప్రకాశం జిల్లా టిడిపి క్లీన్ స్వీప్ చేసేలా చూస్తామని నరసింహారెడ్డి అన్నారు.