కళ్యాణదుర్గం: కుందుర్పిలో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు, స్తంభించిన ట్రాఫిక్
కుందుర్పి మండల కేంద్రంలో కసలయ్య గుట్ట కాలనీకి చెందిన మహిళలు తాగునీటి కోసం బుధవారం రోడ్డెక్కారు. మహిళలు ఖాళీ బిందెలతో కాలనీ వద్ద నుంచి ప్రధాన రహదారి వరకు ర్యాలీగా వెళ్లారు. ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు సర్ది చెప్పినా వినలేదు. రాస్తారోకో కొనసాగించారు. తాగునీటి సమస్యను పరిష్కరించే వరకు కదిలేది లేదన్నారు. వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ కు అంతరాయం తలెత్తింది. తాగునీటి సమస్య పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని పంచాయతీ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.