మొలగముడి స్మశాన రహదారి సమస్యకు పరిష్కారం రేణిగుంట మండలం అత్తూరు పంచాయతీ మొలగముడి గ్రామ ప్రజలను దాదాపు 50ఏళ్లుగా వేధిస్తున్న స్మశానవాటిక రహదారి సమస్యకు మంగళవారం తెరలేపారు. తహశీల్దార్ చంద్రశేఖర్రెడ్డి ఈ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకుని విచారణ జరిపి రహదారి ఏరాటు పూర్తిచేశారు. దీంతో గ్రామస్థులకు ఉన్న ఇబ్బందులు తొలగి, ఆత్మగౌరవంతో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం కలిగిందని వారు సంతోషం వ్యక్తంచేశారు.