కుప్పం: పట్టణంలో సోమవారం నుంచి పోలీస్ యాక్ట్ అమలు: డీఎస్పీ పార్థసారథి
కుప్పం సబ్ డివిజన్ పరిధిలో జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు DSP పార్థసారథి శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో స్పష్టం చేశారు. శాంతి భద్రతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కుప్పం అర్బన్, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం PS పరిధిలో అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు చేయరాదని తెలిపారు. నిబంధనలు మీరితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.