ప్రత్తిపాడు: తుకారపాలెం గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా
గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మొదట గ్రామంలో త్రాగునీటి సరఫరాను పరిశీలించారు. అదే విధంగా గ్రామంలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ప్రస్తుతం గ్రామంలో జరుగుతున్న వైద్య శిబిరాన్ని సందర్శించారు. అనంతరం స్వయంగా గ్రామస్తుల వద్దకు వెళ్లి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా యంత్రాంగం ఏ విధమైన సహాయక చర్యలు చేపడుతున్నారని తెలుసుకున్నారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీరు అవసరాలకు సరిపోతుందా అని అడిగి తెలుసుకున్నారు.