గుమ్మగట్ట మండలం మరెంపల్లి గ్రామంలో 30 మంది యువకులు జనసేన పార్టీలో చేరారు. సోమవారం నియోజకవర్గ ఇంచార్జ్, కురుబ కార్పోరేషన్ డైరెక్టర్ మంజునాథ్ గౌడ వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కురుబ వసంత్ కుమార్, హరినాథ్ గౌడ్, ఓంకార్ నాయక్, సిద్దలింగ, లింగరాజు, తిరుమలేష్, మైలరీ, సోమశేఖర్, తిప్పేస్వామి, శివన్న, హరికృష్ణ నాయక్, రామకృష్ణ నాయక్, సురేష్, మనోజ్ హనుమప్ప, సంజీవప్ప, సిద్దన్న, అంజనప్ప, రవికుమార్, మంజునాథ్ తదితరులు ఉన్నారు.