జిల్లా వ్యాప్తంగా పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా పోలీసులు ప్రజలకు సైబర్ నేరాలు,దొంగతనాలు అరికట్టే అంశంలో ప్రజలకు అవగాహన
Ongole Urban, Prakasam | Nov 3, 2025
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సోమవారం పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలకు సైబర్ నేరాలు దొంగతనాలు అరికట్టే అంశంలో పోలీసులు గ్రామస్తులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. కొత్త వ్యక్తులు ఫోన్ చేసి ఓటిపి నంబర్లు బ్యాంక్ ఖాతా నెంబర్లు అడిగితే చెప్పవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అలానే రెండు ప్రమాదాలు దొంగతనాలు అరికట్టే అంశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు సూచించారు. ఇక పిల్లల్ని మీ ప్రాంతాలలో ఉన్న చెరువులకు కాలువలకు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.