కోరుట్ల: తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది కమ్యూనిస్టులే తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించారు
*తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది కమ్యూనిస్టులే* తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది కమ్యూనిస్టులే అని సిపిఐ మండల కార్యదర్శి MD ఉస్మాన్ అన్నారు. తెలంగాణ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మెట్పల్లి లోని మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం అమరవీరులకు సిపిఐ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. అమరవీరుల చిత్రపటాలకు MD ఉస్మాన్ తో పాటు మున్సిపల్ కార్మికులు విప్లవ జోహార్లు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆనాడు భూస్వాములకు రజాకారులకు ఎదురొడ్డి పోరాడిన కమ్యూనిస్టుల చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు అన్నారు. ఆనాటి భూస్వాముల అకృత్యాలకు బలైపోతున్న రైతుల పక్షాన నిలిచి ప