అవుకు విద్యార్థులకు రాష్ట్రస్థాయి స్కిల్ కాంపిటీషన్ పోటీల్లో చోటు
నంద్యాల జిల్లా అవుకు ఆదర్శ పాఠశాల (ఏపీఎంఎస్) విద్యార్థులు జిల్లాస్థాయి స్కిల్ కాంపిటీషన్లో అద్భుతంగా రాణించారు. ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ విభాగంలో మహమ్మద్ గౌస్, షేక్ రఫీ, గోవర్ధన్, సుశాంత్ బృందం మొదటి స్థానం సాధించి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ హేమిమా తెలిపారు. ఈనెల 7న జరిగిన ఈ పోటీల్లో వీరి ప్రతిభ ప్రశంసలు అందుకుంది.