కనిగిరి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కనిగిరి మండలంలోని వివిధ పార్టీలకు చెందిన 15 మంది వైసీపీ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దేవరపల్లి సుబ్బారెడ్డి మాట్లాడుతూ... కనిగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. తాను కూడా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి కార్యకర్తలకు తగు దిశా నిర్దేశం చేస్తానని చెప్పారు.