గిద్దలూరు: గిద్దలూరు అగ్నిమాపక శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న హోంగార్డు సుబ్బారెడ్డి గుండెపోటుతో మృతి
ప్రకాశం జిల్లా గిద్దలూరు అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న హోంగార్డు సుబ్బారెడ్డి గుండెపోటుతో అకస్మాత్తుగా మంగళవారం మృతి చెందారు. ఉదయం విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన సుబ్బారెడ్డికి గుండె నొప్పిగా ఉన్నట్లుగా కుటుంబ సభ్యులకు తెలిపారు. గిద్దలూరు లోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించి అక్కడ పరీక్షించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగా మార్గం మధ్యలో సుబ్బారెడ్డి మృతి చెందాడు. గతంలోని గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు.